సమంత ఈమధ్యనే బాలీవుడ్ కు పరిచయమైంది. అది కూడా సినిమాతో కాదు, ఫ్యామిలీ మేన్ అనే వెబ్ సిరీస్ తో. అంతలోనే ఆమె సల్మాన్ ఖాన్ కు ఎలా కనెక్ట్ అయిందబ్బా? పోనీ కనెక్ట్ అయిందనే అనుకుందాం, సల్మాన్ తో ఏకంగా డేటింగ్ వరకు ఎలా వెళ్లిందబ్బా? ఇలాంటి అనుమానాలేవీ అక్కర్లేదు. ఇక్కడ మనం చెప్పుకోబోయే సమంత వేరు.
ఈ ముద్దుగుమ్మ పేరు సమంత లూక్ వుడ్. ఈ అమెరికన్ ముద్దుగుమ్మ ఎప్పుడో నాలుగు పదులు వయసు దాటేసింది. కాన చూడ్డానికి మాత్రం దబ్బపండులా పాతికేళ్ల పడుచు పిల్లలా కనిపిస్తుంది. బహుశా.. ఈ అందమే మన కండల వీరుడికి నచ్చి ఉంటుంది. ప్రస్తుతం ఈమెతోనే సల్మాన్ డేటింగ్ చేస్తున్నాడంటూ బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.
సల్మాన్ వయసు 56 సంవత్సరాలు. ఇంకా అతడు ప్రేమిస్తాడని, పెళ్లి చేసుకుంటాడని అనకుంటే అది మన అపోహ అవుతుంది. అతడు కేవలం మెయింటైన్ చేస్తాడంతే, పెళ్లి చేసుకోడు. ఈ క్రమంలో కత్రినాకైఫ్, జాక్వెలిన్, జరీన్ ఖాన్ లాంటి ఎంతోమంది భామలను పైకి తీసుకొచ్చాడు సల్మాన్. ఆమధ్య మరో ఫారినర్ తో కూడా చెట్టపట్టాలేసుకొని తిరిగాడు.
ఇప్పుడు సల్మాన్ తో ఎక్కువగా సమంత కనిపిస్తోంది. గత నెల జరిగిన సల్మాన్ పుట్టినరోజు వేడుకలో ఈ అమ్మడే సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఆమెను చూసిన జనాలంతా సల్మాన్ రసికతను మెచ్చుకోకుండా ఉండలేకపోయారంట. అదన్నమాట సంగతి.