ప్రస్తుతం తెలుగులో గాడ్ ఫాదర్ అనే సినిమా చేస్తున్నాడు సల్మాన్ ఖాన్. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో చిన్న గెస్ట్ రోల్ లో సల్మాన్ కనిపించనున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే సల్మాన్ మరో తెలుగు-హిందీ సినిమాలో కనిపించబోతున్నాడా? ఆయన ఓ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? ప్రస్తుతం ఇవే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దీనికి కారణం దర్శకుడు హరీశ్ శంకర్.
ఉన్నట్టుండి సడెన్ గా సల్మాన్ ఖాన్ తో దిగిన ఫొటోను షేర్ చేశాడు హరీశ్ శంకర్. సల్మాన్ ను కలిశానని, ఆ మూమెంట్ ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని రాసుకొచ్చాడు. తనతో మాట్లాడ్డానికి టైమ్ కేటాయించినందుకు సల్మాన్ కు థ్యాంక్స్ కూడా చెప్పాడు. దీంతో సల్మాన్-హరీశ్ శంకర్ కాంబోలో సినిమా రాబోతోందంటూ ప్రచారం ఊపందుకుంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్, స్వయంగా హరీశ్ ను తనతో పాటు తీసుకెళ్లి సల్మాన్ కు పరిచయం చేశాడు. దీంతో ఈ ముగ్గురూ కలిసి సినిమా చేస్తారేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Advertisements
అటు సల్మాన్, ఇటు హరీష్ కూడా దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. రీమేక్స్ చేయడంలో హరీష్ దిట్ట. మంచి రీమేక్ దొరికితే చేయడానికి సల్మాన్ ఎప్పుడూ రెడీ. అందుకే ఈ కాంబినేషన్ పై ఇన్ని పుకార్లు.