బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సహా పదిమందిని తాము టార్గెట్ గా ఎంచుకున్నామని గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తెలిపాడు. ఈ లిస్ట్ లో సల్మాన్ టాప్ లో ఉన్నట్టు చెప్పాడు. సమయం వచ్చినప్పుడు ఇతడ్ని అంతం చేయాలనుకున్నట్టు చెప్పాడు. . ప్రస్తుతం జైల్లో ఉన్నఈ కరడు గట్టిన క్రిమినల్ ని జాతీయ భద్రతా సంస్థ అధికారులు విచారిస్తున్న సందర్భంలో ఇతగాడు నిర్భయంగా ఈ విషయాన్ని అంగీకరించాడు. . తమ సామాజికవర్గ సెంటిమెంట్లను గాయపరిచిన సల్మాన్ ను వదిలేది లేదన్నాడు.
1998 లో రాజస్తాన్ లో ఈ నటుడు కృష్ణ జింకలను వేటాడాడని, తమ బిష్ణోయ్ వర్గం వాటిని పవిత్రంగా భావిస్తుందని లారెన్స్ పేర్కొన్నాడు. అందుకే ప్రతీకారంగా సల్మాన్ ని హతమార్చాలనుకున్నామన్నాడు. గతంలో తన ఆదేశాలపై తన సహచరుడు సంపత్ నెహ్రా.. ముంబైలోని సల్మాన్ ఇంటివద్ద రెక్కీ నిర్వహించినట్టు వెల్లడించాడు. అయితే హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అతడిని అరెస్టు చేసినట్టు చెప్పాడు.
ఇటీవలి కాలంలో సల్మాన్ కి బెదిరింపులు ఎక్కువయ్యాయి. గత ఏప్రిల్ 11 న ఓ వ్యక్తి. సల్మాన్ కి ఈ-మెయిల్ పంపుతూ.. నిన్ను చంపుతామని హెచ్చరించాడట. అనుమానంపై ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ బాలీవుడ్ స్టార్ కి ఇలా తరచూ బెదిరింపులు అందడంతో ముంబై పోలీసులు ఆయనకు వై కేటగిరీ భద్రతను కల్పించారు.
తీహార్ జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్.. 2021 లో రెండు సెమి ఆటోమాటిక్ పిస్టల్స్ ని సేకరించానని చెప్పాడు. అమెరికాలో తయారైన వీటిని తమ గ్యాంగ్ లోసభ్యుడైన గోల్డీ బ్రార్ ద్వారా అందుకున్నానన్నాడు. గోల్డీ బ్రార్ కెనడాలో ఉంటున్నాడు. ఇక- ఈ ఏడాది ఏప్రిల్ లో తీహార్ జైల్లోనే ఈ ముఠా సభ్యులు టిల్లు తైపురియా పై దాడి చేసి హతమార్చారు. పోలీసుల కళ్ళ ముందే ఈ హత్య జరిగింది.గత ఏడాది మాన్సా జిల్లాలో జరిగిన పంజాబీ సింగర్ సిద్దు మూసేవాలా హత్యలోను లారెన్స్ ముఠా హస్తముందని భావిస్తున్నారు.