బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బర్త్ డేను తన కుటుంబసభ్యులు కొంత మంది బాలీవుడ్ నటుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం సల్మాన్ ఖాన్ 54 వ సంవత్సరం లోకి అడుగుపెట్టారు. గురువారం రాత్రి సల్మాన్ సోదరుడు సోహెల్ నిర్వహించిన బర్త్ డే వేడుకలో ఇండస్ట్రీకి చెందిన కత్రీనా కైఫ్, టబు, సల్మాన్ గర్ల్ ఫ్రెండ్ గా పుకార్లు వస్తున్న లులియా వంటూర్, సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్, తమ్ముడు అర్బాజ్ ఉన్నారు. వీరితో పాటు దబాంగ్ 3 కో స్టార్స్ సోనాక్షి సిన్హా, సాయి మంజ్రేకర్, కిచ్చా సుదీప్ పాల్గొన్నారు.
బర్త్ డే బోయ్ సల్మాన్ ఖాన్ డెనిమ్ ప్యాంట్ మీద బ్లూ టీ షర్ట్ దాని మీద బ్రౌన్ జాకెట్ ధరించారు. సల్మాన్ తో కలిసి భరత్, టైగర్ జిందా హై, పార్ట్ నర్, వంటి సినిమాల్లో నటించిన కత్రీనా కైఫ్ ఎల్లో డ్రెస్ లో మెరిసిపోయారు.