సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా దబాంగ్ 3. ప్రభుదేవా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. చుల్ బుల్ పాండేగా సాల్మన్ ఖాన్ ఎప్పటిలాగే తన కామెడీ టైమింగ్ అండ్ డైలాగ్ డెలివరీతో ఆకట్టున్నాడు. మూడున్నర నిమిషాల డ్యూరేషన్ తో వచ్చిన దబాంగ్ 3 ట్రైలర్ కంప్లీట్ ఎంటర్టైనింగ్ గా ఉంది. దబాంగ్ ఒరిజినల్ ఫ్లేవర్ ని ఎక్కడా మిస్ చేయకుండా, సల్మాన్ స్వాగ్ ని అలానే మైంటైన్ చేస్తూ కథలో చాలా మార్పులు చేసిన ప్రభుదేవా, దబాంగ్ 3ని ప్రీక్వెల్ గా మార్చాడు. చుల్ బుల్ పాండే అనగానే లైట్ గా మీసం, షర్ట్ కాలర్ కి తగిలించిన కళ్లద్దాలు, పంచ్ డైలాగ్స్ గుర్తొస్తాయి. అవి అసలు ఎక్కడ మొదలయ్యాయి, సోనాక్షిని పెళ్లి చేసుకునే ముందే చుల్ బుల్ పాండేకి ఒక లవ్ స్టోరీ ఉంటే ఎలా ఉంటుంది అనే పాయింట్ లో ప్రభుదేవా కథని రాశాడు. ట్రైలర్ లోనే ఈ విషయం క్లియర్ గా చెప్పిన చిత్ర యూనిట్, యంగ్ సల్మాన్ లుక్ ని కూడా రివీల్ చేశారు. ఇతని గర్ల్ ఫ్రెండ్ పాత్రలో సైయ్యి మంజ్రేకర్ కనిపించింది. డెబ్యూ హీరోయినే అయినా, మంజ్రేకర్ ఆకట్టుకుంది.
వీళ్లిద్దరి మధ్య వచ్చే ప్రేమకథ చుట్టూనే దబాంగ్ 3 సినిమా సాగనుంది. అమ్మాయితో ప్రేమలో ఉండి సాఫీగా సాగుతున్న చుల్ బుల్ పాండే లోకి సుదీప్ రావడంతో అసలు కథ మొదలయ్యింది. ఈ క్లాష్ లో మంజ్రేకర్ చనిపోయింది. తన ప్రేమని మర్చిపోయిన సల్మాన్, ఆ తర్వాత చాలా కాలానికి సోనాక్షిని పెళ్లి చేసుకున్నాడు. డ్యూటీలో భాగంగా తన పని తాను చేసుకుంటూ పోతున్న చుల్ బుల్ పాండే లైఫ్ లోకి మళ్లీ సుదీప్ రావడంతో రివెంజ్ మొదలయ్యింది. ఇది ట్రైలర్ చూస్తే సింపుల్ గా అర్ధమైన దబాంగ్ 3 సినిమా. ట్రైలర్ లో వచ్చిన డైలాగ్స్ ఎప్పటిలాగే సల్మాన్ ట్రేడ్ మార్క్ ఎంతెర్తైనింగ్ వే లో సాగింది. సోనాక్షి కనిపించింది కాసేపే అయినా, సల్మాన్ పక్కన ఎప్పటిలాగే చాలా బాగుంది. సుదీప్ విలన్ పాత్రలో మెప్పించేలా ఉన్నాడు. ప్రీక్వెల్, సీక్వెల్ కలయికగా రానున్న ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకి రానుంది.