“మట్టిలో మాణిక్యాలు” అనే సామెత ఎప్పటికీ నిజమే అవుతుందని తరచూ జరిగే కొన్ని సంఘటనలు మనకు నిరూపణ చేస్తూ ఉంతాయి. ఈ మధ్య కాలంలో అలాంతి ఒక సంఘటన ఉత్తరాదిన జరిగింది. ఇప్పుడదే నెటిజన్ల మధ్య వైరల్ గా కూడా మారిపోయింది. రేణూ మోండల్ అనే ఒక మహిళ రైల్వే స్టాషన్ లో కాలక్షేపానికి పాడిన ఒక పాట తనని చిన్నపాటి సెలెబ్రిటీగా మార్చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఆమె రైల్వేస్టాషన్ లో పాడిన పాట సోషియల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అయిపోయింది. ఊసుపోక రేణూ పాడిన పాటే ఆమెను సోహియల్ మీడియా సెలెబ్రిటీని చేసేసింది. ఆ పాట విని ముగ్ధుడైపోయిన ఉత్తరాది సంగీత దర్శకుడు హిమేష్ రేషమ్మియా తనని పిలిపించుకుని మరీ, ప్రస్థుతం తను స్వరాలు సమకూరుస్తున్న ఒక సినిమాలో పాట పాడే అవకాశం ఇవ్వడమే కాకుండా, ఆమె గళంలో స్టూదియోలో పాటను రికార్డ్ కూడా చేసేశారు. ఆమె స్టూడియోలో మైకు ముందు పాట పాడుతుండగా వీడియో రికార్డ్ చేసి, ఆ వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేశారు.
ఈ వార్తలు ఆనోటా, ఈ నోటా విన్న బాలీవుడ్ కండలవీరుడు సల్లూభాయ్ అలియాస్ సల్మాన్ ఖాన్, తాజాగా రేణూ మోండల్ పాటను విని, ఆమె గాత్రానికి ఫిదా అయిపోయారట. ఆమె నైపుణ్యం తెగనచ్చేసిన సల్మాన్, ఈ ఇంటర్నెట్ కోయిలమ్మ రేణూకు ఒక ఇంటిని బహుమతిగా ఇస్తున్నట్టుగా సమాచారం. ఆ ఇంటి విలువ దాదాపుగా 55 లక్షల వరకూ ఉంటుందని భోగట్టా. అంతేకాకుండా 2020లో విడుదల కానున్న తన తదుపరి చిత్రమైన “దబాంగ్ – 3” లో రేణూచేత ఒక పాట కూడా పాడించాలని డిసైడ్ అయ్యారట. ఈ వార్తలను అధికారికంగా ఇంకా ఎవరూ ధృవీకరించకపోయినా, అడపాదడపా అనేక సందర్భాలలో సహాయం అవసరమైన వారికి అడక్కుండానే తన వంతు సాయం అందచెసే సల్మాన్ దానగుణం అందరికీ తెలిసిందే కదా.