మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇందులో ఆచార్య సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉండగా గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలతోపాటు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు చిరు. అయితే మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమా మలయాళంలో సూపర్ హిట్ సాధించిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ పాత్రలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం సల్మాన్ ఖాన్ వారం రోజుల పాటు డేట్స్ ఇచ్చాడట. అయితే ఈ మంత్ ఎండింగ్ లో షెడ్యూల్ జరగనుందట.
ఒకవేళ కరోనా కేసులు పెరిగి షూటింగ్ వాయిదా పడితే ఈ షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందట. లేదంటే యధావిధిగా ఈ షెడ్యూల్ లో సల్మాన్ ఖాన్ జాయిన్ కానున్నారట. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.