బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, ప్రభుదేవా కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం దబాంగ్ 3. దబాంగ్ ఫ్రాంచైజీలో వస్తున్న ఈ మూడో సినిమాను ఇదే ఏడాది డిసెంబర్ 20న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అయ్యారు. కేవలం హిందీలో మాత్రమే కాకుండా సౌత్ లో కూడా దబాంగ్ 3ని భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన సల్మాన్ ఖాన్, అందుకు తగిన ప్రణాళిక రచిస్తూ, ఇందులో భాగంగానే దబాంగ్ డాన్స్ టూర్ పేరుతో హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నవంబర్ 2న ఓ భారీ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. ఇదే ఈవెంట్ లో దబాంగ్ 3 తెలుగు ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. సల్మాన్ ఖాన్ కు నార్త్ లో విపరీతమైన క్రేజ్ ఉన్నా, హైదరాబాద్ ఈవెంట్ స్పెషల్ గా నిలవాలంటే తెలుగు నుంచి స్టార్స్ ఖచ్చితంగా ఈ ఈవెంట్ కి వెళ్లాల్సిందే. ఈ విషయమే ఆలోచించిన చిత్ర యూనిట్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లని ఛీఫ్ గెస్ట్ గా పిలవాలని భావిస్తున్నారట. ఈ ఇద్దరి హీరోలతో సల్మాన్ ఖాన్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. అలాగే ప్రభుదేవాకి కూడా ఎన్టీఆర్ చరణ్ లతో మంచి రిలేషన్ ఉంది. ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి ఇప్పటివరకూ ఏ ఈవెంట్ కి వెళ్లలేదు, సో ఈ కాంబినేషన్ ని తన స్టేజ్ పైన చూపిస్తే ఆ ఈవెంట్ కి భారీ క్రేజ్ వస్తుంది. అందుకే సల్మాన్, చరణ్ ఎన్టీఆర్ లని ఈ ఈవెంట్ కు ఆహ్వానించాడట. మరి మన హీరోలు సల్మాన్ తో కలిసి కనిపిస్తే అభిమానుల సంతోషానికి హద్దే ఉండవు.