బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కు ఉన్న ఈద్ సెంటిమెంట్ గురించి చెప్పనక్కర్లేదు. ఆయన నటించిన ఏదో ఒక సినిమా ఈ పండగకు విడుదల కావడం ఆనవాయతీగా వస్తోంది. ఈసారి కూడా ఆ సెంటిమెంట్‌నే కొనసాగిస్తూ.. మే 31న ఈద్ కానుకగా రాధే సినిమాను విడుదల చేయాలని ఫిక్సయ్యాడు సల్మాన్. కానీ ఆయన కోరిక తీరేలా లేదు.
కరోనా కారణంగా వరుసపెట్టి సినిమాలు విడుదల వాయిదాపడటంతో..ఈద్ మూవీ మేకర్స్ కూడా ఆలోచనలోపడ్డారని తెలుస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో థియేటర్లలో సీటింగ్ కెపాసిటీని 50 శాతం తగ్గించగా.. ఈద్ నాటికి దేశంలో కరోనా పరిస్థితి మరింత ముదిరేలా కనిపిస్తోంది. దీంతో సినిమా విడుదల సందేహమేనంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డాడు సల్మాన్. పరిస్థితులు చక్కబడి, సెకండ్ వేవ్ నియంత్రణలోకి వచ్చాకే రాధే రిలీజ్ గురించి ఆలోచిస్తామని చెప్పుకొచ్చాడు. కాగా, ప్రభుదేవా డైరెక్షన్‌లో తెరకెక్కిన రాధే..దిశాపటానీ సల్మాన్ సరసన నటిస్తోంది.