బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ ఎవరికైనా అవసరంలో సహాయం చేయడంలో ముందుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల, అతని కిక్ కో-స్టార్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అతిథిగా పాల్గొన్న యోలో ఫౌండేషన్ వార్షికోత్సవంలో కూడా ఇదే జరిగింది. ఈ పార్టీ(బాష్)లో వేదిక వద్ద ఉన్న చిన్న పిల్లలతో సల్మాన్ ఇంటరాక్ట్ అవుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఈవెంట్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వీడియోలో బజరంగీ భాయిజాన్.. చిన్న పిల్లలతో వారి భోజనాన్ని ఆస్వాదిస్తూ మాట్లాడటం చూడవచ్చు. బాష్‌లో ప్రతి ఒక్కరికీ వీడ్కోలు పలికే ముందు సల్మాన్ ఒక చిన్న అమ్మాయి నుదిటిపై ముద్దును కూడా పెట్టారు. ఈ కార్యక్రమంలో సల్మాన్ పక్కన జాక్వెలిన్ కూడా ఉంది. ఇద్దరు పిల్లలతో సరదాగా మాట్లాడారు.
ఇక సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుంతం టైగర్ 3 సినిమా పూర్తి చేసే బిజీలో ఉన్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ వీడియోతో విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రం 2023లో విడుదల కానుంది.
దీంతోపాటు ఫర్హద్ సామ్‌జీ డైరెక్షన్‌లో ‘కభి ఈద్ కభి దివాళి’ సినిమా చేస్తున్నారు సల్మాన్ ఖాన్. సాజిద్ నదియావాలా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే, ఈ మూవీలో బిగ్‌బాస్ బ్యూటీ షెహనాజ్ గిల్ కూడా నటిస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ మే 15న ముంబైలో ప్రారంభించనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది.