సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని చాలా రోజుల నుంచి బెదిరింపు లేఖలు, వార్తలు రావడం తెలిసినవిషయమే. గతంలో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ ను చంపేస్తానని అన్నారు. తాజాగా బిష్ణోయ్ మరోసారి ఇదే విషయాన్ని ప్రస్తావించాడు.
పంజాబ్ లోని భటిండా సెంట్రల్ జైలులో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఉన్నారు. ఇటీవలె మీడియా ఇంటరాక్షన్ లో ఈ గ్యాంగ్ స్టర్ఈ షాకింగ్ విషయం తెలిపాడు. శనివారం మధ్యాహ్న సమయంలో ఈ మెయిల్ ద్వారా బెదిరింపు వచ్చినట్లు పోలీసులకు సల్మాన్ కార్యాలయం తెలిపింది.
గోల్డీ బ్రార్ అనుచరుడు మోహిత్ గార్గ్ ద్వారా వచ్చిన మెయిల్లో సల్మాన్ను తమ బాస్ గోల్డీ బ్రార్ నేరుగా కలవాలనుకుంటున్నట్లు మెయిల్లో వెల్లడించాడు. సల్మాన్ను చంపేస్తామనే బెదిరింపు అందులో ఉందని పోలీసులకు తెలిపారు.
సల్మాన్ ఖాన్ కు భద్రత తొలిగిస్తే కచ్చితంగా చంపేస్తానని అన్నారు. సల్మాన్ రావణుడి కంటే పెద్ద అహంకారి అని, కృష్ణజింకను చంపినందుకు ఖాన్ బిష్ణోయ్ వర్గానికి సల్మాన్ కచ్చితంగా క్షమాపణ చెప్పాలన్నారు. సల్మాన్ ను చంపడమే తన లక్ష్యమని బిష్ణోయ్ తెలిపాడు. ఈసందర్బంగా సల్మాన్ కి పోలీసులు మరింత భద్రతను పెంచారు.