ఫ్లాప్ అయిన సినిమా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓటీటీలోకి వచ్చేస్తుంది. దీనికి బాలీవుడ్ కూడా మినహాయింపు కాదు. ఈమధ్య సల్మాన్ ఖాన్ నటించిన కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమా థియేటర్లలోకి వచ్చింది. సౌత్-నార్త్ ఆర్టిస్టుల మిక్సింగ్ తో తెరకెక్కిన ఈ సినిమా.. అటు నార్త్ లో, ఇటు సౌత్ లో ఎక్కడా ఆడలేదు.
అలా డిజాస్టర్ అయిన ఈ సినిమా ఈ వారాంతం ఓటీటీలోకి వచ్చేస్తోంది. శుక్రవారం ఈ సినిమాను జీ5లో స్ట్రీమింగ్ కు పెడుతున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు రాబోతోంది.
సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమా అస్సలు ఆడలేదు. తమిళ్ లో వచ్చిన వీరమ్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారనే విషయాన్ని ఆఖరి నిమిషం వరకు చెప్పలేదు. దీనికితోడు వెంకటేష్ పాత్ర అస్సలు జనాలకు నచ్చలేదు. అలా ఏ కోణంలోనూ ఈ సినిమా మెప్పించలేదు.
ఈ సినిమాతో పూజాహెగ్డే, తన ఫ్లాపుల పరంపరను కొనసాగించింది. సల్మాన్ కూడా పూజాకు హిట్ ఇవ్వలేకపోయాడు. అటు భూమిక రీఎంట్రీ కూడా వృధా అయింది. ఇలా ఎంతోమంది ఆశల్ని నీరుగార్చిన ఈ సినిమా, ఈ వీకెండ్ ఓటీటీలోకి వస్తోంది. కనీసం ఓటీటీలోనైనా క్లిక్ అవుతుందేమో చూడాలి.