ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మొత్తం 57 కేసులు నమోదయ్యాయి .ఇక్కడ మొత్తం 11 డివిజన్లు ఉన్నాయి . కరోనా తో వనస్థలి పురం ప్రాంతం వణికిపోతోంది . దాదాపు 30 కేసులు ఇక్కడే నమోదయ్యాయి .సోమవారం ఒక్కరోజే దిల్ సుఖ్ నగర్ లోని ఒక అపార్ట్మెంట్ లో 8 మందికి కరోనా సోకింది . ఇలా కేసుల సంఖ్య పెరగడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి . స్థానిక ఎమ్మెల్యే అసలు కనిపించట్లేదన్న రామ్మోహన్ రెడ్డి తోలి వెలుగు తో చాలా విషయాలు మాట్లాడారు . ఏం మాట్లాడారో కింది వీడియో లో చూద్దాం.