సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్(82) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయాన్ని మేదాంత ఆస్పత్రి తాజా హెల్త్ బులెటిన్ లో పేర్కొంది.
ఆయన్ని ఐసీయూకీ షిఫ్ట్ చేసినట్టు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు సమాజ్ వాది పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఆయన త్వరగా కోలుకోవాలని ఆ పార్టీ నేతలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. యాదవ్ త్వరగా కోలుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రార్థిస్తున్నారు.
ఆయన అనారోగ్యంతో బాధపడుతూ గత ఆదివారం ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటికే ప్రధాని మోడీ అఖిలేష్ యాదవ్ ను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం.