యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ ఇంకా ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఇప్పటికీ ఇంకా విషమంగానే ఉంది. ఆయన గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ప్రస్తుతం హర్యానా గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన హెల్త్ బులిటెన్ ను వైద్యాధికారులు విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆయనకు జీవనాధార ఔషదాలను ఉపయోగించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఆయన ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందన్నారు. ఇది ఇలా ఉంటే ఆయన అనారోగ్యంతో ఆగస్టు 22న ఆయన ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నారు.
ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి ఆదివారం మరింత క్షీణించింది. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ప్రధాని మోడీ అఖిలేశ్ యాదవ్ ను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆస్పత్రికి వచ్చి ములాయం సింగ్ ను పరామర్శించారు.