యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు ముగిశాయి. ఆయన అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించింది. ములాయం అంత్యక్రియలకు సైఫాయిలో వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు.
తమ ప్రియతమ నేతను చివరిసారిగా చూసుకుని కార్యకర్తలు, ప్రజలు కంటనీరు పెట్టుకున్నారు. నేతాజీ అమర్ రహే అనే నినాదాలతో సైఫాయి గ్రామం మారు మోగిపోయింది. అశ్రునయనాల మధ్య తమ అభిమాన నేతకు కన్నీటితో వీడ్కోలు పలికారు.
ములాయం చితికి ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ నిప్పంటించారు. ములాయం అంత్యక్రియలకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్, బీహీర్ నితీశ్ కుమార్ ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
ములాయం మృతితో యూపీలో మూడు రోజుల పాటు సంతాప దినాలను యోగి సర్కార్ ప్రకటించింది. అంతకు ముందు ములాయం సింగ్ పార్దివ దేహానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబులు నివాళర్పించారు.