లాక్ డౌన్ లో సినిమా షూటింగ్లు లేకపోవడంతో సినీ స్టార్స్ అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇక హీరోయిన్ లు అయితే వంట నేర్చుకోవడం,యోగాలు చేయడం చేస్తూ సమయాన్ని గడుపుతున్నారు. ముఖ్యంగా అక్కినేని కోడలు సమంత విషయానికి వస్తే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్లో ఉంటుంది. సమయం దొరికినప్పుడల్లా వారితో మాట్లాడుతూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటుంది.
తాజాగా సమంత ట్విట్టర్లో ఆస్క్ సామ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకుసమంతసమాధానమిచ్చారు . ఈ సందర్భంగా ఓ నెటిజన్ నటిగా మీకు కష్టమనిపించిన పాత్ర ఎమన్నా ఉందా అని ప్రశ్నించగా నేను గౌతం మీనన్ ను కలిసే వరకు రొమాంటిక్ సీన్స్ చేయడం కష్టమని ఎప్పుడూ అనుకునేదాన్ని, నేను నందిని రెడ్డిని కలిసే వరకు కామెడీ చాలా కష్టమని అనుకున్నాను. ఇప్పుడు నేను ఏ పాత్ర ఇచ్చినా భయం లేకుండా చేయగలను అని చెప్పుకొచ్చింది.
అయితే ఇంకో నెటిజన్ మీరు ఏడ్చిన సందర్భం ఏమైనా ఉందా అని ప్రశ్నించాడు..దీనికి సమాధానం ఇస్తూ ఈ ప్రశ్న అడిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ది ఫ్యామిలీ మాన్ రషెష్ చూసినప్పుడు నేను ఏడవడం ప్రారంభించాను అంటూ చెప్పుకొచ్చింది. మరోవైపు ది ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ లో సమంత నటిస్తోంది. ఇందులో టెర్రరిస్టుగా నెగిటివ్ టచ్ తో కూడిన పాత్రలో కనిపించనుంది. అక్టోబర్ నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.