చిత్ర పరిశ్రమలో 12 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు ఆనందంగా ఉందంటూ ఇంస్టాగ్రామ్ లో ఫోటోలను షేర్ చేసింది హీరోయిన్ సమంత. తన ప్రయాణంలో భాగమైన అభిమానులకు, ధన్యవాదాలు కూడా తెలిపింది.
నిజానికి అప్పట్లో హీరోయిన్ల కెరీర్ 4-5 ఏళ్లు మాత్రమే. సిమ్రాన్ వంటి వారు టాలీవుడ్‌లో తక్కువ కాలం మెరిసి కనుమరుగయ్యారు. అయితే ఇప్పుడు కాజల్ అగర్వాల్, తమన్నా భాటియా వంటి వారు దశాబ్ద కాలంను పూర్తి చేసుకున్నారు. ఇక ఆ లిస్ట్ లో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని సమంత కూడా చేరిపోయింది.
తెలుగులో ఫస్ట్ మూవీతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. అప్పటి నుంచి సమంత ఎక్కడా వెనుకడుగు వెయ్యలేదు. అయితే ప్రస్తుతం ఈ ముగ్గురు హీరోయిన్స్ కూడా బిజీ బిజీ గా గడుపుతున్నారు.
తమన్నా, కాజల్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అలాగే సమంత చేతిలో ప్రస్తుతం యశోద, శాకుంతలం సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి.