హీరోయిన్ సమంత గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. అయితే ఇటీవల అక్కినేని నాగ చైతన్య తో విడాకుల తీసుకున్న సమంత వరుస సినిమాలు చేస్తుంది. ఓ వైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు ఐటెం సాంగ్స్ లో కూడా నటిస్తుంది. ప్రస్తుతం సమంత నటించిన శాకుంతలం సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అలాగే మరి కొన్ని సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.
అయితే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సమంత రకరకాల ఫోటోలను వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఫాన్స్ తో ఇంటరాక్ట్ అవుతూ లైవ్ లోకి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అయితే తాజాగా సమంత ఇంస్టాగ్రామ్ లో అరుదైన రికార్డు ను సొంతం చేసుకుంది. 20 మిలియన్ల ప్లస్ ఫాలో వర్స్ ను సొంతం చేసుకుంది. ఇదే విషయాన్ని చెబుతూ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఓ పోస్టర్ ను పెట్టింది. అలాగే తన ఫాలోవర్స్ కు థాంక్స్ తెలిపింది.