అక్కినేని సమంత పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ మంచి జోష్ మీద ఉంది. గ్లామర్ డోస్ కూడా కాస్త పెంచింది. ప్రస్తుతం విగ్నేష్ శివన్ దర్శకత్వంలో కాత్తువాక్కుల రెండు కాదల్ అనే తమిళ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తుండగా నయనతార, సమంత హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
కాగా ఈ ఇద్దరితో సినిమా చేయటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు సమంత. పవర్ ఫుల్ నటుడు విజయ్ సేతుపతి, మంచి నటి నయనతారతో కలిసి నటించాలని కోరుకున్నాను. ఈ చిత్రంతో ఆ కోరిక తీరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను అంటూ ఇంస్టాగ్రామ్ లో సమంత పోస్ట్ చేసింది.