శాకుంతలం కష్టాలు బయటపెట్టింది సమంత. గుణశేఖర్ దర్శకత్వంలో చేసిన ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించింది ఈ బ్యూటీ. పౌరాణిక పాత్రతో తెరకెక్కిన ఈ సినిమాలో గ్రేస్ చూపించడం చాలా కష్టమైందని చెప్పుకొచ్చింది.
పౌరాణిక పాత్ర కావడం వల్ల కథలో ఎలాంటి సన్నివేశంలోనైనా ఓ ప్రత్యేకమైన ఆహార్యాన్ని చూపించాల్సి వచ్చింది. దాన్ని మెయింటైన్ చేయడం తన వల్ల కాలేదంటోంది సమంత. కూర్చున్నా, నిల్చున్నా, నడిచినా, మాట్లాడినా, చివరికి ఏడ్చినా ఆ గ్రేస్ మిస్ కాకుండా చూడాల్సి వచ్చిందని.. దాని కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది
ప్రస్తుతం ఈమె మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. దాన్నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ బ్యూటీ, లాంగ్ గ్యాప్ తర్వాత తాజాగా ముంబయి ఎయిర్ పోర్ట్ లో ప్రత్యక్షమైంది. త్వరలోనే ఆమె శాకుంతలం సినిమా ప్రచారం ప్రారంభించబోతోంది.
ఫిబ్రవరి 17న థియేటర్లలోకి రాబోతోంది శాకుంతలం. ఈ సినిమాలో శాకుంతల పాత్ర పోషించింది సమంత, మణిశర్మ సంగీతం అందించాడు. దిల్ రాజు సహ నిర్మాతగా వ్యవహరించాడు.