నాగచైతన్య, సమంత విడిపోతున్నారంటూ ఈమధ్య అనేక వార్తలు తెరపైకొచ్చాయి. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తిరుమల శ్రీవారిని ఒంటరిగా దర్శించుకుంది సమంత.
శ్రీవారి దర్శనం అనంతరం బయటకొచ్చిన సమంతను ఓ రిపోర్టర్ విడాకులపై ప్రశ్నలు వేశాడు. దీంతో సీరియస్ అయిన ఆమె గుడికి వచ్చాను.. బుద్ధి ఉందా అంటూ సమాధానం ఇచ్చింది.
ప్రస్తుతం సమంత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె చెప్పిన సమాధానం అభిమానులను ఆకట్టుకుంటోంది. మంచిగా రిప్లై ఇచ్చారంటూ కామెంట్స్ పెడుతున్నారు.