మజిలీ’, ‘ఓ బేబీ’ చిత్రాలు సక్సెస్ అయినా ఇప్పుడు సమంత డైరీ ఎందుకు ఖాళీగా ఉంది ? కొత్తగా ఏ ప్రాజెక్టులకు ఎందుకు సంతకం చేయలేదు? పిల్లల కోసమే విరామం తీసుకుందా? ఎంతమందిని కనాలనుకుంటుంది? అనే ప్రశ్నలు హాట్ టాపిక్ అయ్యాయి. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న సమంత సినిమాలు తగ్గించడం వెనుక ఓ బలమైన కారణముంది? అదేమిటి?
వరుసగా సినిమాలు చేసి లిస్టు పెంచుకోవాలన్న ఆశ సమంతకు లేదు. తక్కువ చేసినా ప్రేక్షకుల మదిలో కలకాలం గుర్తుండిపోయే మంచి చిత్రాలనే చేయాలని సమంత ప్లాన్. సరైన కథ అయితేనే సినిమాలకు అంగీకరిస్తోంది. అందుకే మూవీలు తగ్గించిందని భర్త నాగచైతన్య క్లారిటీ ఇచ్చాడు.
మంచు లక్ష్మీ టాక్ షోలో అతిథిగా పాల్గొన్న సమంత పిల్లలపై క్లారిఫై చేసింది. పిల్లలు పుట్టాక సినీకెరీర్‌కు బ్రేక్ ఇస్తావా? అని మంచు లక్ష్మీ టాక్ షోలో సమంతను ప్రశ్నించింది. పిల్లలు పుట్టాక సినీ కెరీర్‌కు విరామం తప్పకుండా ప్రకటిస్తానని, అయితే అది పూర్తిగా కాదని, కొన్నాళ్ల పాటు మాత్రమేనని సమంత బదులిచ్చింది. కొద్దిగా సంతానం పెద్దయ్యాక కచ్చితంగా మళ్లీ సినిమాలు చేసుకుంటా అని సమంత జవాబిచ్చింది. తమకు ఒక్క బిడ్డ చాలనుకుంటున్నట్లు చెప్పింది.
నాగచైతన్య ఇప్పటికే తమ పిల్లల్ని ఎలా పెంచాలో కూడా ప్లాన్ చేశాడు. ఓ మిడిల్ క్లాస్ అబ్బాయిగానే నాగచైతన్య బాల్యం సాగింది. నాగచైతన్యకు అమ్మానాన్నలు డబ్బులు ఎంత కావాలంటే అంత ఇవ్వడం, గారాబం చేయడం అస్సలు ఉండేవి కావు. సగటు పిల్లల మాదిరిగానే పెరిగారు. తన పిల్లల్ని అలా పెంచడమే సరైనదేమో అని నాగచైతన్య భావిస్తున్నాడు. నా దగ్గర ఎన్ని కోట్లున్నా నాకు ఏం అవసరమో, ఏది కావాలో దానిపైనే ఖర్చు పెట్టగలనని నాగ చైతన్య చెబుతున్నాడు. రేపు నా పిల్లల్ని కూడా అలానే పెంచాలనుకుంటున్నానని అంటున్నాడు. అదీ నాగ చైతన్య, సమంతా జోడీ సంతానం సంగతి.