దిశ ఎన్‌కౌంటర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సత్వర న్యాయం జరిగిందని పోలీసులను కీర్తిస్తున్నారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో… నిందుతులు తిరగబడటంతో తాము ఎన్‌కౌంటర్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు.
దిశను అత్యంత పాశవికంగా చంపినచోటే నిందితులను కూడా చంపటంతో సినిమా ఇండస్ట్రీ కూడా రియాక్ట్ అవుతోంది. ఇప్పటికే ఆ బుల్లెట్‌లను దాచుకోవాలనుంది అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేయగా… ఐ లవ్ తెలంగాణ, భయమనేది కొన్నిసార్లు అవసరమే. ఆ భయాన్ని పోలీసులు కల్పించారు అంటూ సమంత ట్వీట్ చేశారు.