అక్కినేని సమంత పెళ్లి అయిన తరువాత కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. మరోవైపు షోలను కూడా చేస్తూనే వెబ్ సిరీస్ వైపు కూడా అడుగులు వేస్తోంది. ది ఫ్యామిలీ మెన్ 2 లో సమంత నటిస్తుంది. అయితే ఇందులో సమంతా విలన్ గా కనిపించనుంది. ఈ నేపథ్యంలోనే అభిమానులు వెబ్ సిరీస్ రిలీజ్ పై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు . ఇది ఇలా ఉండగా తాజాగా అమెజాన్ ప్రైమ్ ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేసింది.
దానిని సమంత షేర్ చేస్తూ రిలీజ్ డేట్ కూడా ప్రకటించింది. శ్రీకాంత్ మిషన్ వెనుక ఒక విలన్ ఆ విలన్ శ్రీకాంత్ వెనుక ఉంది.. అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ సిరీస్ ను వచ్చే ఫిబ్రవరి 12న హిందీ ,తెలుగు మరియు తమిళ భాషలలో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించింది. మొదటి సిరీస్ లో ప్రియమణి మనోజ్ బాజ్ పాయ్ అదరగొట్టిన సంగతి తెలిసిందే.
This time, no one is safe! #WhoisRaji
Chehre ke peeche chehra, raaz hai ismein gehra 🤫#TheFamilyManOnPrime on 12th Feb#TheFamilyManSeason2 #TheFamilyManOnPrime@rajndk @BajpayeeManoj @PrimeVideoIN pic.twitter.com/9XzMtS3YYd— Samantha Akkineni (@Samanthaprabhu2) January 7, 2021