శాకుంతలం టీమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసింది. సమంత శకుంతలగా ప్రధాన పాత్రలో నటించిన ఈసినిమాలో మలయాళ యంగ్ స్టార్ దేవ్ మోహన్ దుష్యాంతుడిగా కనిపించబోతున్నారు. గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈసినిమాలో చిన్నారి భరతుడి పాత్రలో అల్లు అర్జున్ గారాల పట్టి….అల్లు అర్హా నటిస్తోంది. ఈసినిమాతోనే ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా తేరంగేట్రం చేయబోతోంది.
ఇక ఈసినిమాను వచ్చే నెల అంటే ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతున్న ఈమూవీ ప్రమోషన్స్ కు పదును పెట్టారు టీమ్. సమంత కూడా అనారోగ్యం నుంచి కోలుకుని ప్రమోషన్స్ కోసం రెడీ అయ్యింది. ఇందులో భాగంగా సినిమా యూనిట్ తాజాగా జూబ్లీ హిల్స్ లోని పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేయించారు. సమంత, దేవ్ మోహన్ తో పాటు దర్శకుడు గుణ శేఖర్.. మరికొంత మంది టీమ్.. పెద్దమ్మ గుళ్లో సందడి చేశారు.
సమంతతో పాటు మలయాళ యంగ్ స్టార్ దేవ్ మోహన్ ట్రెడిషనల్ డ్రెస్ లోమెరిసిపోయారు. గుడిలో ఎంటర్ అయిన దగ్గర నుంచి ప్రతీ ఫ్రేమ్ లో చాలా అద్భుతంగా కనిపించారు. ఇక గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాను కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరక క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు ప్రేక్షకుల మనసులని దోచేస్తున్నాయి.
విజువల్ వండర్‌గా త్రీడీ టెక్నాలజీతో తెలుగు, హిందీ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో శాకుంతలం సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే రిలీజైన ట్రైలర్, మల్లికా మల్లికా.. సాంగ్ సోషల్ మీడియాలో భారీ వ్యూస్ తో సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. శాకుంతలం సినిమాకి సాయి మాధవ్ బుర్రా డైలాగ్ రాయగా.. శేఖర్ వి.జోసెఫ్ సినిమాటోగ్రఫీ చేశారు. ఇక విజువల్‌గానే కాకుండా మ్యూజికల్ హిట్ గాను ఈసినిమా నిలవబోతుందన్న నమ్మకంతో ఉన్నారు టీమ్.
ఇక ఈసినిమాలో సమంత, దేవ్ మోహన్ జంటగా నటిస్తుండగా.. వీరితో పాటు మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, జిస్సు సేన్ గుప్తా లాంటి నటులు కీలక పాత్రలను పోషించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ యువరాజు భరతుడి పాత్రలో నటించటం విశేషం.