చాన్నాళ్లుగా ప్రయోగాలు చేస్తోంది సమంత. రొటీన్ గ్లామర్ పాత్రలు కాకుండా.. నటించడానికి స్కోప్ ఉండే క్యారెక్టర్స్ ఎంచుకుంటోంది. ఇందులో భాగంగా ఓ బేబీ, యూటర్న్ లాంటి సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం అదే పంథాను కొనసాగిస్తూ యశోద అనే సినిమా చేస్తోంది. ఇప్పుడీ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ మేటర్ బయటకొచ్చింది.
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ఇద్దరు కొత్త దర్శకుల్ని పరిచయం చేస్తూ వస్తున్న సినిమా యశోద. ఈ సినిమాలో సమంత నర్సు పాత్రలో కనిపించబోతోందట. ఇదొక థ్రిల్లర్ సినిమా. మెడికల్ మాఫియా చుట్టూ తిరిగే డిఫరెంట్ స్టోరీగా దీన్ని చెబుతున్నాడు. ఇప్పటివరకు టాలీవుడ్-కోలీవుడ్ లో ఇలాంటి స్టోరీ రాలేదంట. అందుకే ఈ సినిమా చేయడానికి అంగీకరించింది సమంత.
ప్రస్తుతం సమంత చేస్తున్నవన్నీ డిఫరెంట్ పాత్రలే. శాకుంతలం సినిమాలో మైథలాజికల్ రోల్ చేస్తున్న ఈ బ్యూటీ.. ఓ హాలీవుడ్ సినిమాలో బై-సెక్యువల్ గా కనిపించనుంది. ఇక పుష్ప సినిమాలో ఆమె ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.