ఇటీవల హీరోయిన్ సమంత, నాగచైతన్య తో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే విడాకుల ప్రకటన తర్వాత వరుస సినిమాలను లైన్ లో పెడుతోంది ఈ అమ్మడు. ఐటెం సాంగ్స్ కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇదిలా ఉండగా గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేసేందుకు అన్నపూర్ణ స్టూడియోస్ లో అడుగుపెట్టారు సమంత. విడాకుల ప్రకటన తర్వాత మొదటిసారి సమంత అన్నపూర్ణ స్టూడియోస్ లో అడుగుపెట్టారు. ఇక ఈ సినిమాతో పాటు తమిళంలో విజయ్ సేతుపతి నయనతార తో కలిసి ఓ సినిమా చేస్తోంది ఈ బ్యూటీ.