ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉంది. చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతూ విదేశాల్లో చికిత్స చేయించుకుందనే వార్తలు వచ్చాయి. మొత్తానికి వీటన్నింటినీ చెక్ చెబుతూ, మరోసారి సోషల్ మీడియాలోకి ఎంటరైంది సమంత. వస్తూ వస్తూనే హాట్ టాపిక్ గా మారింది.
టీషర్ట్ వేసుకొని సెల్ఫీ దిగింది సమంత. అందులో తన ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడింది. టీషర్ట్ పై ఉన్న క్యాప్షన్ మాత్రమే కనిపించేలా ఫొటో పోస్ట్ చేసింది. ఆ ఒక్క ఫోటోతో సమంత వైవాహిక జీవితంపై మరోసారి వదంతులు చెలరేగాయి.
“జీవితంలో ఒక్కదానివి ఒంటరిగా నడవలేవు” అనే క్యాప్షన్ ఇచ్చింది సమంత. మీరు వినాలనుకుంటే ఇది కూడా వినండి అంటూ ఈ కొటేషన్ పెట్టింది. దీంతో ఆమె వైవాహిక జీవితంపై మరోసారి వార్తలు పుట్టుకొచ్చాయి.
రీసెంట్ గా ధనుష్-ఐశ్వర్య విడిపోయారు. ఆ తర్వాత రజనీకాంత్ చొరవతో ఇద్దరూ మళ్లీ కలిసిపోయారు. తాజా స్టేట్ మెంట్ తో సమంత-నాగచైతన్య కూడా ఇలానే కలిసిపోతారని చాలామంది భావిస్తున్నారు.
మరికొంతమంది మాత్రం.. సమంత మరో తోడు వెదుక్కుందని, దాన్ని ఇలా క్యాప్షన్ రూపంలో పరోక్షంగా బయటపెట్టిందని చెబుతున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నప్పటికీ, సమంత మాత్రం తన క్యాప్షన్ తో మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
ఆమె నటించిన యశోద, శాకుంతలం సినిమాలు రెండూ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నాయి. త్వరలోనే థియేటర్లలోకి రాబోతున్నాయి. ఆ సినిమాల ప్రచారం కోసం సమంత త్వరలోనే మీడియా ముందుకు రానుంది.