ఏమాయచేశావే సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన బ్యూటీ సమంత. తన అందంతో, నటనతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన సమంత టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతుంది. తెలుగులోనే కాకుండా తమిళ్ సినిమాల్లోనూ తన మార్క్ చూపించింది. ఇటీవల ఓ బేబీ సినిమా తో హిట్ కొట్టిన సమంత జాను సినిమాతో ప్రేక్షకుల ముందు రానుంది. తమిళ్ మూవీ 96 రీమేక్ గా తెరకెక్కుతున్న జాను సినిమాలో శర్వానంద్ సరసన నటించింది. ఈ సినిమా ఫిబ్రవరి 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Advertisements