పెళ్లైన తర్వాత సమంత సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రిపరెన్స్ ఇస్తోంది. సమంత చేతిలో ప్రస్తుతం శాకుంతలమ్ అనే ఏకైక సినిమా ఉంది. గుణశేఖర్ దర్శకత్వంలో ఈ మూవీ రాబోతుంది. ఆ తర్వాత సినిమాలేవీ చేతులో లేవు.
అయితే, చాలా మంది కథలు వినిపిస్తున్నప్పటికీ… సమంతా ఒప్పుకోవటం లేదని తెలుస్తోంది. తను కొన్నాళ్లు బ్రేక్ తీసుకోబోతుందన్నది ఫిలింనగర్ టాక్. సమంత మనసు ఇప్పుడు మాతృత్వం వైపు మళ్లిందని, అందుకే… సినిమాలకు కొంతకాలం గ్యాప్ ఇవ్వాలనుకుంటోందని ఆమె సన్నిహితులు చెబుతున్నట్లు ప్రచారం సాగుతుంది. అందులో భాగంగా.. ఇప్పటికే ఒప్పుకున్న ఓ సినిమాని సైతం సమంత పక్కన పెట్టేసిందని, శాకుంతలమ్ తర్వాత సినిమాలేవీ చేయదని గట్టిగా వినిపిస్తోంది.