ఇటీవల నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి కూడా ఈ ఇద్దరూ హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. అయితే తాజాగా నాగ చైతన్య పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సమంత.
ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఒకానొక సమయంలో నేను చైతన్యతో కలిసి షూటింగ్ చేసేటప్పుడు నా దగ్గర కనీసం అమ్మకు కాల్ చేసి మాట్లాడడానికి కూడా డబ్బులు ఉండేవి కావు. అయితే ఆ సమయంలో నా పరిస్థితిని అర్ధం చేసుకున్న చైతన్య తన ఫోన్ ఇచ్చి ఎంతసేపైనా మాట్లాడమని చెప్పాడు.
నిజంగా చైతన్య పర్ఫెక్ట్ జెంటిల్ మ్యాన్ అని ఫైన్షియల్ గా చైతన్య నన్ను ఆదుకున్నాడని చెప్పుకొచ్చింది సమంత. అయితే సమంత కామెంట్స్ విన్న అక్కినేని అభిమానులు, నెటిజన్స్ ఈ ఇద్దరు ఎందుకు విడిపోయారా అంటూ మళ్ళీ చర్చించుకుంటున్నారు.
Advertisements
ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల, లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో హిట్స్ అందుకున్నాడు చైతన్య. ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమా చేస్తున్నాడు. సమంత శాకుంతలం, యశోద సినిమాలతో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తుంది.