సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు. వెండితెర అయినా బుల్లితెర అయినా డిజిటల్ అయినా తనకంటూ ఓ ఇమేజ్ ఉంది. ఈ మధ్య సినిమాలు తగ్గించి, వెబ్ సిరీస్ లపై దృష్టిపెట్టిన ఈ అమ్మడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
బాలీవుడ్‌లో హీరోలు, హీరోయిన్లు ఎలాంటి పాత్రల్లో నటించినా ప్రేక్షకులు చూస్తారు… ఆదరిస్తారు. ఒకేలా సినిమాలు తీయకపోయినా, వైవిద్యభరితంగా ఉన్నా చూస్తారు. కానీ సౌత్ లో మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. అలాంటి పరిస్థితులు ఉండవు… థియేటర్ కు వచ్చే సగటు వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని సినిమా చూడాల్సి ఉంటుందన్నారు. కానీ ఓటీటీలు వచ్చాక పరిస్థితుల్లో మార్పు వస్తుందన్నారు.