దిల్ రాజు తన సినిమాలను ఏవిధంగా ప్రమోట్ చేసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా విడుదలకు నెల రోజుల ముందు నుండే హాడావిడి మొదలైపోతుంది. రోజుకో వార్తను బయటకు వదులుతూ… సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తాడు. యావరేజ్ సినిమాను కూడా హిట్ బాట పట్టించటంలో దిల్ రాజుకు మంచి పట్టుందన్న పేరు ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఉంది.
ఇటీవల విడుదలైన జాను సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. సమంత, శర్వానంద్ నటించిన జాను సినిమా ప్రమోషన్స్ హైరేంజ్‌లో ఉంటాయని అంతా అనుకున్నారు. పైగా తమిళ్‌లో సూపర్ హిట్ సినిమా 96రీమేక్ సినిమా కావటంతో… గ్యారంటీ హిట్ కాబట్టి దిల్ రాజు మ్యాజిక్ చేయబోతున్నాడని అంతా అనుకున్నారు. కానీ ఎలాంటి హాడావిడి లేకుండానే సినిమా రిలీజ్ చేశాడు. రిలీజ్ అయిన తరువాత మంచి టాక్ తెచుకున్నప్పటికీ కూడా సినిమా ప్రమోషన్ పై ఎలాంటి ప్రమోట్ చెయ్యలేదు. దీంతో దిల్ రాజు పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సమంత, శర్వానంద్ నటనకు సినీ అభిమానులు ఫిదా అవుతున్నారు. సినిమా కూడా రీమేక్ అయినప్పటికీ మంచి టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్ లు మాత్రం పెద్దగా రాలేదు. దానికి కారణం దిల్ రాజు అంటూ నెటిజన్స్, సినీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. మరి సినిమా ప్రమోషన్స్ లో ఎప్పుడూ ముందు ఉండే దిల్ రాజు ఇప్పుడు వెనక్కి తగ్గటకి కారణం ఏంటని తెగ చర్చించుకుంటున్నారు.