తేజ సజ్జా, ఆనంది, దక్ష హీరోహీరోయిన్లుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రేక్షకులముందుకు వచ్చిన చిత్రం జాంబి రెడ్డి. సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం థియేటర్స్ లో సినీ అభిమానులను ఆకట్టుకుంది. హిట్ టాక్ రావడంతో ప్రేక్షకులు కూడా క్యూ కడుతున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఈ సీక్వెల్ ని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. ఇక గత కొన్ని రోజులుగా సీక్వెల్ పై సోషల్ మీడియా లో రకరకాల రూమర్స్ వచ్చాయి. అందులో ఒకటి జాంబి రెడ్డి 2లో సమంత కూడా నటిస్తుందనేది కూడా ఉంది. అయితే అది నిజం కాదని దర్శకుడు క్లారిఫికేషన్ ఇచ్చారు. నిజానికి సమంత ఓకే చెప్పింది ఈ సీక్వెల్ కి కాదట. సమంత వేరొక కథ కి ఓకే చెప్పిందని… ప్రస్తుతం నిర్మాత కోసం వెయిట్ చేస్తున్నానని దర్శకుడు ప్రశాంత్ క్లారిటీ ఇచ్చేశాడు.