అందం, అవకాశాలు ఉన్నా అదృష్టం వరించని హీరో అక్కినేని అఖిల్. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా హిట్టు అనే మాట వినబడటం లేదతనికి. దీంతో ప్రస్తుతం తాను చేేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌పైనే కోటి ఆశలు పెట్టుకున్నాడు. ఇది కూడా తేడా కొడితే ఆయనతో సినిమాలు తీసేందుకు నిర్మాతలు ముందుకు రావడం కష్టమేనన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అఖిల్ కోసం అతని వదిన సమంత ఓ ఛాన్స్‌ను వెతికి పెట్టిందన్న టాక్ వినిపిస్తోంది.
సమంతతో ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌సిరీస్ చేసిన రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే.. ఇటీవల ఓ సినిమా కథను వినిపించారట. అయితే ఆ ప్రాజెక్టును ఆఖిల్‌తో చేస్తే బాగుంటుందని, తాను కూడా రోల్ చేస్తానంటూ బంపర్ ఆఫర్ ఇచ్చిందట. ఇక ఈ సినిమానును అశ్వినిదత్ నిర్మిస్తారని ఫిలింనగర్ టాక్.