చూస్తుంటే ఈసారి సమంత పెద్ద ఛాన్స్ కొట్టేశాలా ఉంది. ఫ్యామిలీ మెన్-2 తర్వాత బాలీవుడ్ నుంచి వస్తున్న కొన్ని ఆఫర్లను తిరస్కరిస్తున్న ఈ బ్యూటీ, ఎట్టకేలకు ఓ పెద్ద సినిమాలో బుక్ అయ్యే అవకాశాలున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన సమంత హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉంది.
సల్మాన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది నో ఎంట్రీ అనే సినిమా. ఈ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీకి ఇద్దరు హీరోయిన్లు కావాలి. ఓ హీరోయిన్ గా ఆల్రెడీ తమన్నాను తీసుకున్నారట. మరో హీరోయిన్ గా సమంతను తీసుకోవాలనే ఆలోచనలో సల్మాన్ ఉన్నట్టు తెలుస్తోంది.
బాలీవుడ్ సినిమాలు హిట్టవ్వాలంటే, సౌత్ కనెక్ట్ తప్పనిసరి. కేవలం అక్కడివారిని నమ్ముకుంటే వసూళ్లు రావడం లేదు. అందుకే బ్రహ్మాస్త్ర సినిమాకు సౌత్ లో కూడా భారీగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా నో ఎంట్రీ సీక్వెల్ లో కూడా సౌత్ తారాగణం ఎక్కువగా కనిపించబోతోంది. అలా సమంతకు సల్మాన్ సరసన నటించే అవకాశం వచ్చిందంటున్నారు.
ప్రస్తుతం తెలుగులో యశోద, శాకుంతలం, ఖుషీ సినిమాలు చేస్తోంది సమంత. వీటిలో శాకుంతలం, యశోద సినిమాలు పూర్తయ్యాయి. ఖుషి షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టుడియోస్ లో జరుగుతోంది. సో.. కాల్షీట్ల పరంగా సమంత ఖాళీగానే ఉంది.