తమిళం, తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న సమంత వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తోంది. ఆ ప్రమోషనల్ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంది. తాజాగా సమంత పోస్ట్ చేసిన ప్రమోషనల్ వీడియో చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.
బ్లెండర్స్ ప్రైడ్ కు సంబంధించిన ప్రమోషన్ వీడియో ఇది. ఈ వీడియోలో హాట్ హాట్ గా కనిపించింది సమంత. అయితే సమంత ఇలా మద్యం ప్రకటనలో నటించడంపై కొంత మంది అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం క్వీన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఫిట్ నెస్ విషయంలో మీరు చాలా మందికి స్ఫూర్తి. ఆ విషయం మరిచిపోయి ఇలా డబ్బు కోసం మద్యం ప్రకటనల్లో నటించటం బాలేదు అంటూ ట్వీట్ లు చేస్తున్నారు అభిమానులు.
అయితే నిజానికి సమంత ఆ వైన్ బ్రాండ్ కోసం కాకుండా వారు నిర్వహించే షోల కోసం ప్రచారం చేస్తుంది. ఆ పేరు చూసి సమంత విస్కీని ప్రమోట్ చేస్తోందని చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో కాదు వాక్కుల రెండు కాదల్ సినిమాలో నటిస్తుంది. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.మరోవైపు తెలుగు సినిమాలతో కూడా బిజీగా ఉంది సమంత.
Advertisements