టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం ‘శాకుంతలం’ చిత్రాన్ని వేసవి కానుకగా రిలీజ్‌కు రెడీ చేసింది. ఈ సినిమాను గుణశేఖర్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రం ‘ఖుషి’ దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తోంది. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సమంత అనారోగ్యం కారణంగా వాయిదా పడింది.
కాగా, ఇప్పుడిప్పుడే సమంత తిరిగి షూటింగ్స్‌లో పాల్గొంటుండటంతో ‘ఖుషి’ చిత్ర యూనిట్ కూడా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతోంది.
ఈ సినిమా షూటింగ్‌లో విజయ్ దేవరకొండతో పాటు పలువురు నటీనటులు నటించనున్నారు. అయితే, ఇప్పుడు సమంత కూడా ఈ షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
మార్చి 8 నుండి ఖుషి చిత్ర షూటింగ్‌లో అమ్మడు జాయిన్ కాబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల సమంత తాను నటిస్తున్న పలు వెబ్ సిరీస్‌ల షూటింగ్‌లలో జాయిన్ అయ్యింది. దీంతో ఖుషి చిత్ర షూటింగ్‌లో కూడా జాయిన్ అయ్యేందుకు ఆమె రెడీ అవుతోంది. ఇక విజయ్ దేవరకొండతో పలు కీలక సన్నివేశాల్లో సామ్ ఈ షూటింగ్ చేయనుంది.
రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, సమంతల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తుండగా, జూన్ నెలలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.