ఇప్పుడు సినిమా అంటే ఇమేజ్ లు కాదు. ఆలోచింపజేసే కథ, ఆకట్టుకునే కథనం.సినిమా నచ్చితే హీరో ఎవరనేది విషయం కాదు. సినిమాలో ఉన్న విషయమే విషయం. ఇప్పడు వరల్డ్ సినిమా ప్రేక్షకుడికి అందుబాటులో ఉంది. ఇంకా చెప్పలంటే చేతిలో ఉంది.
అందుకే స్ట్రైయిట్ మూవీస్ తో పాటు, డబ్బింగ్ సినిమాలకు కూడా డిమాండ్ పెరిగింది. అయితే ఇదే అంశం ఇప్పుడు శాకుంతలంను డిస్టర్బ్ చేస్తోంది. శాకుంతలం సినిమాలో సమంత టైటిల్ రోల్ ప్లే చేస్తోంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 14 న విడుదలకు డేట్ లాక్ చేసుకున్నారు.
ఏప్రిల్ ఎండింగ్ లో పొన్నియన్ సెల్వన్ 2 సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆలోపు కలెక్షన్స్ రాబట్టుకుంటే ప్రాజెక్ట్ హిట్ స్టేటస్ పడుతుందని అనుకుంటున్న నేపథ్యంలో శాకుంతలానికి సరికొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. బిచ్చగాడు 2 సినిమాను కూడా ఏప్రిల్ 14 న విడుదల చేయాలనీ మూవీ మేకర్స్ భావిస్తున్నరట.
చాలా ఏళ్లుగా హిట్ లేకుండా ఉన్న విజయ్ ఆంటోని ఈ సినిమా మీద ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా ఎఫెక్ట్ సమంత శాకుంతలం మీద పడుతుందని సినీ వర్గాల వారు అంచనా వేస్తున్నారు