హీరో అవసరం లేకుండా సినిమాని తమ భుజాలపై మోయ్యగల సత్తా ఉన్న ఈ లేడీ సూపర్ స్టార్స్ తమకంటూ ఒక సెపరేట్ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నారు. వీరిని చూడడానికి ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారు.
ఒకప్పుడు సావిత్రమ్మ, ఆ తర్వాత విజయశాంతి, ఈ ఇద్దరి తర్వాత అనుష్క శెట్టి, ఇక ఇప్పుడు సమంత అని చెప్పవచ్చు. వీళ్లకి మాత్రమే లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్ వచ్చింది. అయితే మిగిలిన ముగ్గురిలో సమంత మాత్రమే ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్ ని సోలోగా మేంటైన్ చేస్తోంది.
ఇప్పటివరకూ సౌత్ కి మాత్రమే పరిమితం అయిన సమంతా ‘శాకుంతలం’ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తోంది. నార్త్ హీరోయిన్స్ కి సౌత్ లో మార్కెట్ లేదు, తమిళ మలయాళ హీరోయిన్స్ కి నార్త్ లో మార్కెట్ లేదు.
అటు నార్త్, ఇటు సౌత్ ని బాలన్స్ చేస్తూ అడుగులు వేస్తున్న సమంతా ‘హాలీవుడ్’లో కూడా వెబ్ సీరీస్ చేస్తోంది. తన మార్కెట్ ని హ్యూజ్ గా ఎక్స్పాండ్ చేస్తున్న సమంతా అందుకు శాకుంతలం సినిమానే ఫస్ట్ స్టెప్ గా భావిస్తున్నట్లు ఉంది.
అనారోగ్యం నుంచి కంప్లీట్ గా రికవర్ అయిన సమంతా ఏప్రిల్ 14న విడుదల కానున్న శాకుంతలం సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చెయ్యడానికి రెడీ అయ్యింది. రిలీజ్ కి మరో మూడు వారాలు మాత్రమే ఉండడంతో శాకుంతలం సినిమా ప్రమోషన్స్ ని పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేశారు.
ఈ ప్రమోషన్స్ కి కిక్ స్టార్ట్ ఇస్తూ సమంతా సోషల్ మీడియాలో మూడు ఫోటోలు పోస్ట్ చేసింది. బ్యూటీ ఇన్ బ్లాక్ అనిపించే రేంజులో ఉన్న ఫోటోస్ లో సామ్ బ్యూటీఫుల్ గా ఉంది. స్టైలిష్ గా ఉన్న సామ్, త్వరలో ప్రియాంక చోప్రాని ముంబైలో కలవనుంది. హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ ప్రమోషన్స్ కోసం సమంతా, ప్రియాంక చోప్రా కలవనున్నారు.
ప్రియాంక చోప్రా లాంటి ఇంటర్నేషనల్ ఇమేజ్ ఉన్న స్టార్, శాకుంతలం గురించి మాట్లాడితే నార్త్ లో ఆ సినిమాకి మంచి బజ్ క్రియేట్ అవుతుంది. అనడంలో ఎలాంటి సందేహం లేదు.
సో సామ్, ప్రియాంక చోప్రాల మీటింగ్ సమంతా మార్కెట్ మరింత పెంచే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ 28న అవెంజర్స్ డైరెక్టర్స్ క్రియేట్ చేసిన ‘సిటాడెల్’ సీరీస్ నుంచి మొదటి రెండు ఎపిసోడ్స్ అమెజాన్ ప్రైమ్ లో ప్రిమియర్ కానున్నాయి.
#Shaakuntalam 🤍#ShaakuntalamOnApril14
Let’s talk all things #Shaakuntalam pic.twitter.com/m0yPpzpzcD— Samantha (@Samanthaprabhu2) March 21, 2023