సమంత…అతి తక్కువ కాలంలోనే దక్షిణాది స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటీమణి. సమంత గొప్పనటి మాత్రమే కాదు, సమాజానికి తన వంతు సాయమందిచే మానవతా వాది కూడా. అయితే గత కొంత కాలంగా వ్యక్తిగత జీవితంలో క్లిష్టమైన సవాళ్ళను ఎదుర్కొంటోంది. ఓవైపు విడాకులతో ఒంటరి జీవితం,మరోవైపు విమర్శలు, తాజాగా మయోసైటిస్ అనే వ్యాధితో ఇబ్బంది పడుతోంది. ఇలాంటి అనఅనుకూల పరిస్థితులతో రాజీలేని పోరాటం చేస్తూ..ఏ మాత్రం ఆత్మస్థైర్యం కోల్పోలేదు. దక్షిణాది సినిమాలే కాదు, బాలీవుడ్ లోనూ తన ప్రతిభను చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ఇటీవల చాలారోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సమంత తాజాగా అభిమానులతో టచ్ లోకి వచ్చింది. ట్విట్టర్ లో లైవ్ చాట్ నిర్వహించి, ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా జవాబిచ్చింది. ఇప్పుడు జీవితం ఎలా ఉంది? అని ఓ అభిమాని ప్రశ్నించగా, ఈ జీవితం మరోలా ఉందని సమంత సమాధానమిచ్చింది. మీలాంటి అభిమానులే తన బలం అని, మీ ప్రేమాభినాలు తన వెన్నంటి నడిపిస్తున్నాయని మరో అభిమానికి రిప్లై ఇచ్చింది.
నేనెవరో తెలియని ఓ అమ్మాయి కోసం రోజూ ప్రార్థిస్తున్నాను… దీనిపై మీరేమంటారు? అని ఓ అభిమాని అడగ్గా… ఆ అమ్మాయికి నువ్వు అవసరం అని శామ్ బదులిచ్చింది. ఇక సమంత కొత్త చిత్రం శాకుంతలం సినిమా గురించి ఓ అభిమాని ప్రస్తావించాడు. 3డీలో రిలీజ్ చేసేంత ప్రత్యేకత శాకుంతలం చిత్రంలో ఉందా? అని ప్రశ్నించాడు. మీరే చూస్తారుగా అంటూ సమంత వెల్లడించింది.