అక్కినేని యంగ్ హీరో అఖిల్ సరైన సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. త్వరలో రాబోయే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ తో హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ తెరకెక్కిస్తుండగా, ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ మూవీకి సై అన్నాడు.
సురేందర్ రెడ్డి మూవీతో పాటు అఖిల్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రాజ్ నిడిమోరు, డీ.కే కృష్ణాల దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉంది. ఈ ఇద్దరు అమెజాన్ లో సక్సెస్ అయిన ది ఫ్యామిలీ మాన్ చేశారు.
ది ఫ్యామిలీ మాన్ సీక్వెల్ లో సమంతా నటించింది. అక్కడ ఏర్పడ్డ పరిచయమే అఖిల్ సినిమాకు మూలమని తెలుస్తోంది. వెబ్ సిరీస్ షూటింగ్ టైంలో… దర్శకులు ఓ స్టోరీ లైన్ చెప్పి, హీరోను సజెస్ట్ చేయమని కోరగా సమంతా అఖిల్ పేరు చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది. దీంతో అలా అఖిల్ కూడా ఒకే చెప్పేశారని, మరిది సక్సెస్ కోసం వదిన తాపత్రయ పడుతుందని ఫిలింనగర్ వర్గాల కథనం.