తరగని అందం, మొక్కవోని విశ్వాలకు మారు పేరు సమంత.తనదైన నటనతో ఏ పాత్రకైనా ప్రాణపోయగలిగే నటి ఆమె. గతకొంత కాలంగా వ్యక్తిగత కారణాలతోనూ, ఆరోగ్య కారణాలతోనూ సతమతమయింది సమంత.
ఈ నేపథ్యంలోనే సినిమాలకు కూడా దూరమయ్యింది. అయితే మళ్ళీఆమె కెరీర్ మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.ప్రస్తుతం బాలీవుడ్ మూవీ ‘సైటడెల్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. మరోవైపు సమంత గురించి ఒక విషయం వైరల్ అవుతోంది. సామ్ పర్మినెంట్ గా ముంబైకి మకాం మారుస్తోందనేదే ఆ వార్త.
రానున్న రోజుల్లో ఆమె బాలీవుడ్ పై పూర్తి స్థాయిలో దృష్టిని సారించబోతోందని…ఈ క్రమంలో అక్కడ ఉండేందుకు ముంబైలో ఇంటిని కొనుగోలు చేసిందని సమాచారం.
మూడు పడక గదులున్న ఆ ఇంటికి ఆమె రూ. 15 కోట్లు చెల్లించిందని వినికిడి. అయితే ఈ అంశంపై సమంత నుంచి కానీ, ఆమె టీమ్ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.