తెలుగు ఆడియన్స్ ఫేవరెట్ కపుల్ ఎవరూ అంటే టక్కున గుర్తొచ్చే పేర్లు సమంతా,నాగచైతన్య.. మొన్నీ మధ్య రానా పెళ్లిలో ఈ జంట చేసిన సందడి అంతా ఇంతా కాదు…ఆ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది సమంతా..ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సమంతా ఫోటోలపై ఓ లుక్కేద్దామా..!
రానా,మిహికల పెళ్లి అతి కొద్దిమంది బంధువుల మధ్య జరిగిన విషయం తెలిసిందే..పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమాల్లో దగ్గుబాటి,అక్కినేని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.వారిలో సమంతా నాగచైతన్యా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు..ఎవరితోనో ఆసక్తిగా మాట్లాడుతున్న సమంతాపై నాగచైతన్య వెనకనుండి వచ్చి అక్షింతలు వేస్తున్న ఫోటో ఒకటి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది..మేడ్ ఫర్ ఈచ్ అదర్.. దిష్టి తీసుకోండి.. అంటూ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు..
ఆ ఫోటోలో సమంతా కట్టుకున్న చీర కూడా ప్రత్యేకంగానే వుంది..రోకా, మెహెంది, పెళ్లి ఫంక్షన్లకు అట్టహాసంగా రెడి అయిన సమంతా ఈసారేంటి ఇంత సింపుల్ గా చీర కట్టుకుంది.అనుకుంటే.. సమంతానే కాదు.. దగ్గుబాటి ఫ్యామిలి మొత్తం చేనేత వస్త్రాలనే ధరించారు..వాటన్నింటి ఆంధ్రప్రదేశ్లోని పొందూరు నేతన్నలు తమ చేతతో స్వయంగా నేసిన బట్టలు అంటూ ఆ విషయాన్ని కూడా షేర్ చేసుకుంది.
మనకు తోచినవిధంగా స్థానిక చేనేత కార్మికులను మరియు చేతివృత్తులవారికి మద్దతు ఇద్దాం.. మన అద్బుత సంప్రదాయాలను సజీవంగా ఉంచుదాం..అనే క్యాఫ్షన్ తో వెంకటేష్, సురేశ్, మరియు దగ్గుబాటి కుటుంబ సభ్యులు వెంకటేశ్ కూతురు ఆశ్రిత, నాగచైతన్య మదర్ లక్ష్మి దగ్గుబాటి..వారందరితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసింది. సమంతా, రానా ఎప్పుడూ చిన్నతరహా పరిశ్రమల్ని ప్రోత్సహించడానికి ముందుంటారని నిదర్శనంగా ఆ పెళ్లి తాలుకా ఫోటోలు నిలిచాయి.. మీరు చూసేయండి..!