రీసెంట్ గా సమంత, వరలక్ష్మి శరత్ కుమార్ కలిసి ఓ రెస్టారెంట్ కు వెళ్లి లంచ్ చేశారు. వీళ్లిద్దరూ కలిసి లంచ్ చేశారనే విషయాన్ని మీడియా చెప్పింది. కానీ అదే టైమ్ లో ఓ కీలకమైన విషయాన్ని చాలామంది మరిచిపోయారు. అదేంటంటే.. వాళ్లిద్దరితో పాటు స్టయిలిస్ట్ నీరజ కోన కూడా ఉంది. సమంత పక్కన స్టయిలిస్ట్ నీరజ కోన ఉండడం పెద్ద షాకింగ్.
సమంత కెరీర్ పీక్ లో ఉన్న టైమ్ లో ఆమెకు స్టయిలిస్ట్ గా నీరజ కోననే వర్క్ చేశారు. ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండేది. అయితే సమంత ఎప్పుడైతే నాగచైతన్యకు దగ్గరైందో, అప్పుడిక నీరజ-సమంత మధ్య గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ ఎందుకొచ్చిందనే విషయం ఎవ్వరికీ తెలీదు. అలా నీరజ కోనకు దూరమైన సమంత.. బాలీవుడ్ కు చెందిన సాధన సింగ్, ప్రీతమ్ జుకాల్కర్ ను తన స్టయిలిస్టులుగా పెట్టుకుంది.
కొన్నాళ్ల పాటు వీళ్ల హవా నడిచింది. అయితే రీసెంట్ గా సమంత, నాగచైతన్య విడిపోయారు. అదే టైమ్ లో ప్రీతమ్ జుకాల్కర్ పేరు తెరపైకొచ్చింది. వాళ్లిద్దరు విడిపోవడానికి ప్రీతమ్ కారణమంటూ ఊహాగానాలొచ్చాయి. అదే టైమ్ లో ప్రీతమ్, నాగచైతన్యపై వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశాడు. దీంతో ఎందుకొచ్చిన గొడవంటూ ప్రీతమ్ ను దూరం పెట్టింది సమంత.
అలా ప్రీతమ్ దూరమైన వెంటనే నీరజ లైన్లోకి వచ్చారు. సమంత-నీరజ-వరలక్ష్మి కలిసి లంచ్ చేశారు. సో.. సమంతకు ఇప్పుడు నీరజ మరోసారి స్టయిలిస్ట్ గా మారినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం సాయిపల్లవి, కృతిషెట్టి, కాజల్, కీర్తిసురేష్, నితిన్, నాని, శృతిహాసన్ లాంటి హీరోహీరోయిన్లకు స్టయిలిస్ట్ గా వ్యవహరిస్తోంది నీరజ.