కొంతకాలంగా సమంత, నాగ చైతన్య గురించి సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. కానీ సామ్ మాత్రం స్పందించటం లేదు సరికదా తన పని తను చేసుకుంటూ వెళ్తోంది. ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో శకుంతలం సినిమా పూర్తి చేసిన సమంతా, తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ చేసింది.
నెట్ ఫ్లిక్స్ కోసం వెబ్ సిరీస్ చేస్తున్న సమంతా… తాజాగా ఓ కొత్త దర్శకుడి కథకు ఓకే చెప్పింది. ఆదిత్య 369, జెంటిల్ మెన్, సమ్మోహనం వంటి సినిమాలు ప్రొడ్యూస్ చేసిన కృష్ణ ప్రసాద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ సంస్థ నిర్మిస్తుండగా… దసరాకు అధికారికంగా ప్రకటించనున్నారు. నవంబర్ నుండి షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.