హీరోయిన్ సమంత అల్లుఅర్జున్ పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే యూట్యూబ్ లో లిరికల్ సాంగ్ దుమ్ములేపుతుంది. ఊ అంటావా ఊఊ అంటావా అంటూ సమంత వేసిన స్టెప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజా ఈ పాటకు మేల్ వెర్షన్ నెట్టింట వైరల్ అవుతుంది.
ఒరిజినల్ పాటలో ఉన్న ఆ పదాలనే మగ ప్లేస్ లో ఆడ అని మార్చి పాడిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుంది. మీ కళ్లల్లోనే వంకర ఉంది. ఆడాళ్ల బుద్ధే వంకర బుద్ధి. ఊ అంటావా పాప ఊఊ అంటావా అంటూ పాడిన ఈ పాటకు మెగాస్టార్, పవన్ కళ్యాణ్, ప్రభాస్ , అల్లు అర్జున్, మహేష్ బాబు, రవితేజ మాస్ స్టెప్పులతో ఎడిట్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.
Fun male version of #OoAntavaOoOoAntava 😀 #Pushpa pic.twitter.com/hIeOFjfS2s
— Vaali (@vaaalisugreeva) December 15, 2021
Advertisements