నాగ చైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న తరువాత కూడా సమంత సినిమాల్లో నటిస్తూనే ఉంది. టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ జాబితాలో కొనసాగుతోంది. ఈ మధ్యకాలంలో ఆమె చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తోంది. తాజాగా సమంత నటించిన ‘జాను’ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ నేపథ్యంలోనే సమంత గురించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.
త్వరలోనే సమంత సినిమాలకు గుడ్ బై చెప్పనుందా..?అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వివాహం అయిన తరువాత రెండు, మూడేళ్ళ వరకే సినిమాలు చేయాలనీ… ఆ తరువాత కుటుంబాన్ని చూసుకోవాలని సమంత భావిస్తోందట. తన భర్త నాగచైతన్యను చూసుకోవడంతోపాటు,మదర్ గా కూడా మారాలనే యోచనలో సమంత ఉన్నట్టు తెలుస్తోంది.
గ్లామర్ ఫీల్డ్ లోని ప్రతి కథ నాయిక.. హీరోయిన్ గా తన చరిష్మాకు ఎదో ఒక సమయంలో ముగింపునివ్వాల్సిందే. ఈ క్రమంలోనే చిత్ర పరిశ్రమలో తన హావ తగ్గక ముందే సినిమాలకు గుడ్ బై చెప్పాలనే యోచనలో ఉందట సమంత. కాగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.