ఇటీవల సోషల్ మీడియాలోఓ వీడియో వైరల్ గా మారింది. ఓ రైతు ఒక అవును అమ్మేయగ దాని కొనుక్కున్న వ్యక్తి ఒక వ్యాన్ లో ఎక్కిస్తాడు. ఆవు వెనుకాలే ఓ ఎద్దు అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉంటుంది. ఆ తరువాత ఆ వ్యాన్ ముందుకు కదులుతుంది. వ్యాన్ వెనుకాలే కొద్ది దూరం పరిగెడుతూ ఎద్దు కూడా వెళుతుంది. దీంతో చూసే వారు అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియా లో పెట్టారు.
అయితే చివరకు వాహనంలో తీసుకెళ్ళి పోతారు. చాలా దూరం వరకు వాహనం వెనకాలే ఎద్దు కూడా పరిగెడుతుంది. ఈ వీడియోపై సినీ రాజకీయ ప్రముఖులు ఎంతో మంది స్పందించారు. అంతేకాకుండా ఆ ఆవును కొనుక్కున్న వ్యక్తి కి పెద్ద సంఖ్యలో విజ్ఞప్తులు కూడా చేశారు. చివరకు అందరి విజ్ఞప్తుల మేరకు ఆ రెండింటినీ కలిపి పూజలు చేశారు. తాజాగా ఈ వీడియోను టాలీవుడ్ హీరోయిన్ అక్కినేని సమంత పోస్ట్ చేశారు. దానికి లవ్ సింబల్ ని కూడా అటాచ్ చేశారు.
— Samantha Akkineni (@Samanthaprabhu2) September 11, 2020